మిల్ట్రీ క్యాంటీన్ నుంచి కొనుగోలు..ఎక్కువ ధరలకు అమ్మకాలు..22 స్కాచ్ మద్యం బాటిల్ల స్వాధీనం.
అర్జున్ సమాచారం ప్రతినిధి హైద్రాబాద్ ఆగస్టు 18,
శక్తి నగర్ ఆర్కే పురం కాప్రా ప్రాంతంలో డిఫరెన్స్ కు సంబంధించిన రాధా కురుష సామల్ అనే వ్యక్తి ఖరీదైన స్కాచ్ బాటిల్లను అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు.
ఈ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ సిఐ కోటమ్మ సిబ్బంది కలిసి రాధా కురుశ్యామల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి ఖరీదైన 22 స్క్రాచ్ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈమధ్య బాటిల్ లను మిల్ట్రీ క్యాంటీన్ నుంచి తీసుకువచ్చి ఒక బాటిల్ పై రూ.500 నుంచి రూ.1000 అదనంగా తీసుకుంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెళ్లడయింది.
నిందితుడిని మద్యం బాటిల్లను కాప్రా ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు తెలిపారు.